x

Experience the best version of stumagz by getting the app.

Get College News, Updates
at just 5 MB

Continue to Mobile Website

Human Interest

పడమటి సూరీడు

 ” ఏంటి తాత ఇంకా ఈ మగ్గం ,ఈ వృత్తి , ఈ ఊరు అని అంటావ్ ? జనం అంట బ్రాండ్లు , కంపెనీ లు అని అనుకుంటుంటే ఇంకా వీటికి గిరాకి ఎం వుంటుంది ? అసలు వీటిని ఎవరి పట్టించుకుంటారు ”

  అవును ఈ తరం వారందరూ ఇదే అనుకుంటారు. జీవించటానికి జీతాలు కావాలి కానీ జీతం కోసం జీవించకూడదు. బ్రతుకు తెరువు కోసం పుట్టెడు అన్నం పెట్టిన వృత్తిని బజారు కీడ్చే బతుకులు కావు మావి. ఈ శ్వాస ఎప్పుడు ఆగుతుందో తెలీదు, ఈ రోజు ఈ క్షణం నాకు కడుపు నింపే ఈ వృత్తి ని వదులుకోలేను, వదులుకోను కూడా. 

“మనవడా !! మార్పు అందరు కోరుకుంటారు కానీ చీర కట్టు భారతీయ సంస్కృతిని , భారత స్త్రీ లోని అందాన్ని ప్రతిబింబిస్తుంది. కంచి పట్టు , ఉప్పడ పట్టు ఇలా చెప్పుకుంటూ పోతె ఎన్నో మరెన్నో. “కాలం మారినంత మాత్రాన కళలు కాలగర్బంలో కలసిపోవు.రాత్రి కనే కలకు పగలు ప్రాణం పోసేవే ఈ కళలు.” “ఏంటో ఈ చాదస్తం!! వయసుతో పాటు నీ చాదస్తం కూడా పెరుగుతోంది.” మనసుకు నచ్చే మనసులు మెచ్చే ఈ కళను నేను వదులుకోలేను దానితో నాకున్న అనుబందం అలాంటిది. మనసును చంపుకొని మనుషులని వాడుకొని బ్రతికే రాజకీయ నేతలం కాము మేము .. “చేనేతలం”… కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు కానీ ఈ కాలం లో కోటి కోసం కడుపు నింపిన విద్యలను అణచివేస్తున్నాం. కరములు కదిలితే కానీ కడుపులు నిండవు. రోజంతా చెమటోడ్చి పని చేసిన చేతికి వచ్చేది 50 రూపాయలు. కూడు , గుడ్డ , పిల్ల జల్ల అందరు ఆ 50 తోనే జీవించాలి. నేతలు మా దరికి రారు, దరిద్రం మా దరి నుండి పోదు. రాట్నం ఆడించాలి , మరాస తిప్పాలి , మగ్గం కదిలించాలి ఒక బట్ట వెనక ఉన్న కష్టం , అది నేసే వాడి దారిద్యం ఎవరు చూడరు చూడాలని అనుకోరు. కష్టాలు అలవాటయి పోయాయి కన్నీరు ఇంకి పోయాయి బ్రతుకులే భారమై పోయాయి అయిన గుండెలో బలం చేతిలో నైపుణ్యం అవసరమే ఆయుధం .. చీకటి కమ్మిన,తొలకరి తాకినా ఈ ” పడమటి సూరీడు ” మళ్ళి ఉదయిస్తాడు. కనుమరుగవుతున్న కళలకు మళ్ళి వెలుగిస్తాడు.

Message

Responses