కాలం మారింది , ఋతువులు మారుతున్నాయి, ప్రదేశాలు మారుతున్నాను , మనుషులు మారుతున్నారు . కొత్త పరిచయాలు పాత పరాజయాలు మిగిల్చిన చేదు అనుభావలాకు ఉరటనిస్తున్నాయి. ఎన్ని మారినా , ఎన్ని వచ్చినా, నా మనసు మారదు. ఆ మనసున దాగిన మనిషి కూడా మారదు. ఆమె కోసం వేచి చూసే సమయం కుడా ఆగదు. వైజాగ్ నగరానికి వచ్చి 5 సంవత్సరాలు అవుతోంది. కాని నాకు మాత్రం ఈ విశాఖపట్నం ఎప్పుడూ పాతగా అనిపించలేదు. ఈ మహానగరం లో తనతో పాటు తిరగని చోటు లేదు, చూడని సినిమా లేదు. ఎక్కడికి వెళ్ళినా తన జ్ఞాపకాలే వెంటాడుతున్నాయి. కళలు కుడా కనడం మానేసాను , కళ్ళలో తన రూపమ్ ఎక్కడ చేదిరిపోతుందేమో అని. పుట్టిన మనిషి ఎవరైనా మరణిస్తాడు, వికసించీ ఎ పువ్వు అయినా వాడిపోతుంది.అలాగే ప్రతీ కదా కి ఒక ముగింపు ఉంటుంది. ఎన్నో కధలు చూసాను , ఇంకెన్నో కధలు విన్నాను. కాని నాకు కూడా ఒక కధ ఉంటుంది, దానికి కుడా ఒక ముగింపు ఉంటుంది అని ఎ రొజూ అనుకోలేదు. బహుసా నా కధ కి ముగింపు నేను ఒంటరినై నిరీక్షించడమే అయి ఉంటుంది ..............
*** సాయింత్రం 5:30 అవుతోంది. వర్షం పడేలా ఉన్నట్లుంది, rk beach మొత్తం ఆహ్లాదంగా ఉంది , చిన్న పిల్లలు ఇసక కోటలు కట్టుకుంటున్నారు , ముసలి వాళ్ళు వాళ్ళ అలనాటి చిలిపితనాన్ని గుర్తుకు తెచుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు , ప్రేమికులు ఒకరి భుజం పై ఒకరు వాలి అలా ఊహల లోకం లో విహరిస్తున్నారు.అలాగే ఒక రాయిపై కూర్చొని ఇదంతా చూస్తూ అలా తన గతం లోకి వెళ్ళిపోయాడు ఆఆ కుర్రవాడు ........ [ 3 సంవత్సారాల క్రితం ,ఇదే RK BEACH ... ] " హెల్లో, నా పేరు సందీప్ , gitam కాలేజీ లో b.tech 2nd year చదువుతునా . మీ పేరు తెలుసుకోవచ్చా ? " ఏమాత్రం జడవకుండా హుందా గా ఆ అమ్మాయి కళ్ళలోకి సూటి గా చూస్తూ అడిగాడు ఆ కుర్రాడు. మరీ అంత పొడుగు ఏమి కాదు కాని సన్నగా ఉన్నాడు . మొఖం లో తరిగిపోని కల ఉంది ...తలని ఎ మాత్రం పక్కకి కూడా తిప్పకుండా ఆఅ అమ్మాయి ఎదురుగా నిల్చొని ఆ నీలి రంగు కళ్ళలోకి అలా చూస్తూ సమాధానం కోసం నిలుచొని ఉన్నాడు. చిన్న పిల్లలాంటి అమాయఖమైన ముఖం తో, చాల చిరాకు కోపం నిండిన కళ్ళతో ఆ కుర్రాడిని పైనుంచి కింద వరుకు ఒకసారి చూసి అక్కడనుంచి లేచి వెళ్లిపోయింది తను. ఎ మాత్రం సిగ్గుపడకుండా అలానే చూస్తూ ఉన్నాడు సందీప్ , ఏదో ప్రపంచ యుద్ధం ఆపినట్టు మురిసిపొథూ .. అల రోడ్డు మీదకి వెళ్లి తన స్కూటీ ఎక్కి వెళ్ళిపోయింది .. కొద్దిగా దూరమ్ వెళ్లి మల్లి వెనక్కి తిరిగి చుసిన్ధి.... {to be continued }.............................................................................................................................. Si.Cho ( SIddhartha CHOkkakula)
0 Comments