కరదర్శనంః
కరము అంటే చెయ్యి, దర్శనం అంటే చూడటం. మనము నిద్రలెయ్యగానే ముందుగా మన రెండు అర చేతులను జోడించి వాటిని చూస్తూ ‘కరాగ్రే వసాతే’ … అనే శ్లోకం చదువుతూ అది పూర్తి అయ్యాక ఆ చెతులను నుదిటి పై నుండి నాభి బిందువు వరకు తీసుకువస్తాము. అలా చెయ్యడం వలన మన జీర్ణ వ్యవస్థ సక్రమముగా అవుతుంది కానీ మన దురదృష్టవశాత్తు ఈ ఆచారం కనుమరుగయ్యే స్థితిలో ఉంది.
నమస్కారంః
ఎవరైనా తెలిసిన వాళ్ళు కనపడ్డా కొత్తవాళ్ళు ఎవరైనా వచ్చినా మనం ముందుగా నమస్కారం చేస్తాం. అలా చెయ్యడానికి ఒక కారణం ఉంది. అది ఏంటి అంటే మనం నమస్కారం చేసినపుడు మన రెండు చేతులు కలుస్తాయి.ఆ సమయంలో మన మునివేళ్ళు ఒకదానికి ఒకటి ఒత్తుకుపోతాయి అలా అవ్వడం వల్ల మెదడు లోని జ్ఞాపక నాడులు ఉత్తేజితమై అలా పలకించిన వ్యక్తులను ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునేలా చేస్తుంది.
ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం అని అర్ధం. అంటే ఒక్క పొద్దు అన్నమాట. ఒక పూటే తినడం లేదా అసలు తినకపోవడం లేదా ఫలహారాలే తీసుకోవడం ఇలాంటివన్నీ అన్నమాట!. ఉపవాసం అనేది పండగ సమయాల్లో మరియు శ్రావణ మాసం లో ఎక్కువగా చూస్తుంటాం. అపుడపుడు ఇలా చెయ్యడం వలన మన జీర్ణ వ్యవస్థ మీద భారం తగ్గుతుంది. ఎక్కువ తినడం వలన కలిగే బద్దకం , ఆ బద్దకం వలన బుర్ర సరిగా పనిచెయ్యకపోవడం వంటి బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇది ముక్యంగా విద్యార్దులకు చాలా ఉపయోగం.
గుడి గంటలుః
మనం గుడికెళ్ళినపుడు గుడిలో ద్వజస్తంభం తో పాటు గుడి గంటలు కూడా ఉంటాయి. ద్వజస్తంభం లేని గుడి అయినా ఉంటది కానీ గంటలు లేని గుడి మాత్రం ఉండదు. ఈ గంటలు అనేవి అనేక రకాల లోహాలతో తయారుచెయ్యబడతాయి ముక్యంగా కాపర్ , జింక్ , బ్రాస్ కలిసి ఉంటాయి. ఆ గంట కొట్టడం వలన వెలువడే శబ్దం మన మెదడు లోని నెగటీవ్ ఆలోచనలు తగ్గుతాయి అలాగే మన శరీరంలోని ఏడు చక్ర స్థానాలు సరిఅవుతాయి. మన కుడి ఎడమ మెదడులు ఒక్కటి చెయ్యబడతాయి అని ఒక నమ్మకం ఈ శబ్ద తరంగాల ద్వారా.
మన తల్లిదండ్రులకు, పెద్దవాళ్లకు ఏదో ఒక సందర్బంలో మనం వాళ్ల పాదాలు పట్టుకుంటాం. అపుడు వాళ్ళు చేతిని మన తలపై పెట్టి ఆశీర్వదిస్తారు. కాలి బ్రొటన వేలు లో శక్తి తరంగాలు ఉంటాయి అన్న నమ్మకం మనం అలా పాద నమస్కారం చేసేటపుడు మన నుదిటి ఆ బ్రొటనవేలికి తగిలి ఆ తరంగాలు మన శరీరంలోకి ప్రవేశించి పాజిటీవ్ శక్తి గా అవుతుంది.
ఇవి కొన్ని మాత్రమే ఇలాంటి ఆచారాలు, సంప్రదాయాలు మన సంస్కృతి లో కోకొల్లలు. హిందూ సంప్రదాయం ఇంతలా పాపులర్ అవ్వడానికి ఇవి కొన్ని మచ్చుతునకలు.
0 Comments