x

Experience the best version of stumagz by getting the app.

Get College News, Updates
at just 5 MB

Continue to Mobile Website

Human Interest

స్నేహం=ఆరోగ్యం

 మనకి తెల్సినంత వరకు మన ఆహార అలవాట్లు మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి కానీ మనకి తెలియని విషయం ఏంటంటే మన సామాజిక బంధాలు ముఖ్యంగా మన స్నేహితులు కూడా చాలా ముఖ్యపాత్ర ఉంటుంది. మరి ఎలానో తెలుసుకోవాలి అంటే ఆలస్యం చెయ్యక ఇది చదివెయ్యండి.

 మానసిక సంతోషం :

  ఒంటరి గా ఉన్నవాళ్ళు ఎపుడూ ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో జరుగుతొందీ అని రకరకాలుగా అలోచిస్తూ ఏం చెయ్యాలో తెలియక సతమతం అవుతుంటారు. అదే మనకి స్నేహితులు ఉంటే మనకి ఏం అనిపించినా వాళ్లతో పంచుకుంటాం. మనసు తేలిక అవుతుంది దాంతో పాటు మనిషి కూడా బాగుంటాడు.

 ఒత్తిడిలో ఉన్నపుడు :

ఒత్తిడికి కూడా కారణం ఒంటరి తనమే. ఆ ఒంటరి అనే భావన వచ్చినపుడల్లా మన శరీరం లో ఒత్తిడిని కలిగించే కార్టీసోల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది.అది శరీరంలో హార్మోన్ సమతుల్యతను దెబ్బ తీస్తుంది. అదే పక్కన ఫ్రెండ్ ఉంటే మనకి ఒంటరి అనే ఫీల్ యే రాదు ఇక అపుడు హార్మోన్ ఏం వస్తది. కాబట్టి ఇలా జరగ కూడదు అనుకుంటే స్నేహం చెయ్యాల్సిందే.

 జీవిత కాలం:

  ఆస్ట్రేలీయా లో ఒక యూనివర్సిటీ చేసిన సర్వే ప్రకారం మంచి స్నేహితుడు ఉన్నవాళ్ళు , లేని వాళ్ళ కంటే ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు అంట!!.. ఆ సర్వే 10 సంవత్సరాల పాటు 1500 మంది పై చేసారు. మంచి స్నేహితుడు ఉంటే మరింత కాలం బ్రతుకుతాం.

ముసలితనం: 

  ఇది నమ్మరు కానీ నమ్మి తీరాల్సిందే ఎందుకంటే University of Brandeis వాళ్ళు సర్వే చేసి ఇది నిజం అని ప్రూవ్ చేసారు కాబట్టి. చిన్న చిన్న వ్యాయామలతో పాటు స్నేహం కూడా ఉంటేనే ఇది సాధ్యం . గుర్తుపెట్టుకోండి.  

 తెలివితేటల్ని పెంచుతారు

  పక్కన ఫ్రెండ్ ఉంటే మనం ఊరక ఉండం కదా!!?? ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. ఆ మాటల్లోంచి ఐడియాలు, వస్తాయి, తెలియని విషయాలు తెలుసుకుంటాము దాంతో మన తెలివి కూడా పెరుగుతుంది.

 చెడు వ్యసనాలకి బానిసలు కాకుండా కూడా చూస్కొంటారు. అన్నింటికన్నా ముఖ్యమైంది ఒకటి ఉంది అది నేను రాయకూడదు మీరు చదవకూడదు. కానీ స్నేహం చెయ్యండి, స్నేహితులతో ఉండండి అంతా మంచే జరుగుతది.

  "True friendship is like sound health; the value of it is seldom known until it is lost." ―Charles Caleb Colton

Message

Responses