మన దగ్గర డబ్బు ఉన్నపుడు ఎంత సంతోషం గా ఉంటుందో ఆ డబ్బు డబ్బు అలా అలా ఖర్చు ఐపోతుంటే అంతే బాధ గా ఉంటది. ముఖ్యంగా విద్యార్ధులకు ఐతే నెలకు సరిపడా నెలసరి ఖర్చులకు సరిపడా ఇస్తే వారానికే ఐపోతుంటాయి. ఒక్కసారి మనం జేబులో చూసి ఎందుకు ఖర్చు పెట్టాం ఎక్కడ ఖర్చు పెట్టాం అన్నది నోటుబుక్కులో పేపర్లు తిరగేసినట్టు మన బుర్రలోని రీళ్ళను తిరగేస్తే దిమ్మతిరిగే సమాధానం వస్తుంది. అదే “ఒరేయ్ నువ్వు పెట్టింది అంతా చిల్లర ఖర్చే!” మరి మన విద్యార్ధులకు సంబంధించిన అలాంటి వాటి మీద ఓ లుక్ వేద్దాం ఇపుడు.
బైట తిండ్లు
అన్నిటికన్నా మనం ఎక్కువ ఖర్చు పెట్టెది దీని మీదే. మనకి తినడం అంటే ఇష్టం కానీ వండటం కాదు కదా!!?? ఇంట్లో ఉండేవాళ్ళు రోజూ వండుతున్నాం కదా! ఈరోజు బైట కానిద్దాం లే అని బైట ఉన్నవాళ్ళు రోజూ బైటే కదా! ఈరోజు కూడా అలాగే కానిద్దాం అని. ఒకసారి నెల బిల్లు లో నుండి వాటిని తీసేసి చూడండి 500-700 దాకా మిగుల్తాయి.
వాటర్ బాటిల్స్
నిజమే మీరు చదువుతున్నది. బేకరి కి వెళ్ళినపుడో లేక ఫాస్ట్ ఫూడ్ సెంటర్ కి వెళ్ళినపుడో అక్కడ ఉన్న వాటర్ మనం తాగము. మనకి సపరేట్ గా వాటర్ బాటిల్ కావాల్సిందే అరలీటర్ తాగే దానికి రెండులీటర్ల బాటిల్ కొంటాం.ఈసారి దీని గురించి చించండి ఒక 100 ఐనా తగ్గుతాయి.
ఆల్కహాల్ & స్మోకింగ్
ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. కొందరు విద్యార్ధి మహాశయులు వీటి మీద విపరీతంగా ఖర్చు పెడుతుంటారు. ఏమొస్తదో తెలియదు కాని జేబుకి చిల్లు మాత్రం పడుతుంది.రోజుకి ఎలా లేదన్నా 2-3 సిగరెట్లు , వారానికి ఒకసారి మందు లెక్క కలిపితే ఒక 200 . అవి మానేస్తే అసలు ఆ అలవాటే లేకపోతే ఎంత మిగులుతుందో ఆలోచించండి.
షాపింగ్స్
షాపింగ్ అవసరం మేర చెయ్యల్సిన అవసరం ఉంది కాని అవసరాన్ని మించితే అనవసర ఖర్చు జాబితాలోకి చేరుతుంది, జేబుకి చిల్లు వేస్తుంది. ఒకరు అని కాదు అందరూ అంతే , ఒక పాంట్ కొనాలి అని వెళ్తారు. అక్కడ ఆషాఢం ఆఫర్లు , శ్రావణం సేల్స్ అని చూడాగానే టెంట్ అవ్వడం అందరికీ అనుభమే మన స్త్రీ మూర్తులకు అందరికన్నా ఎక్కువ అనుభవం. ఆ అనవసర ఖర్చుని భరించడం మన పురుషపుంగవులకు తప్పని ఘంఘాటం.
ఇక వీటితో పాటు స్పా లని పార్టీలని అదనీ ఇదనీ ఇలా లెక్కవేసుకుంటూ పోతే లెక్కలేనన్ని వస్తాయి లెక్కలోకి మన బెండు తియ్యడానికి .. కాబట్టి నా తోటి విద్యార్దులకు మరియు మిగిలిన వాళ్ళందరికి ఖర్చుని కొంచం అదుపులో పెట్టుకుంటే జీవితం సుఖమయం.
0 Comments